శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

March 29th Gold Price.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 March 2022 7:39 AM IST
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి ధ‌ర పెరుగుతూ ఉంటుంది. అందుకనే ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునే వారు ఎల్ల‌ప్పుడూ వాటి ధ‌ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచుతారు. ఇక నేడు ప‌సిడి ధ‌ర త‌గ్గింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల ప‌సిడి ధర‌పై రూ.250 మేర త‌గ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.52,400

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,310

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950, 24 క్యారెట్ల ధర రూ.52,310

వెండి ధరలు

కిలో వెండి ఢిల్లీలో రూ. 68,400, ముంబైలో రూ. 68,400, చెన్నైలో రూ.72,700, హైదరాబాద్‌లో రూ. 72,700, విజయవాడలో రూ. 72,700, విశాఖపట్నంలో రూ. 72,700 గా కొన‌సాగుతోంది.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story