స్థిరంగా బంగారం.. భారీగా తగ్గిన వెండి ధర
March 27th Gold Price.గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు పసిడి ధరలు స్థిరంగా
By తోట వంశీ కుమార్ Published on 27 March 2022 2:30 AM GMTగత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇక పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి తగ్గితే మరోసారి పెరుగుతూ ఉంటుంది. ఆదివారం దేశీయంగా 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర మాత్రం బాగా తగ్గింది. కిలో వెండి పై రూ.1000 మేర తగ్గింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,840
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,690
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,590
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల ధర రూ.52,590
వెండి ధరలు
కిలో వెండి న్యూఢిల్లీలో రూ. 68,900, ముంబైలో రూ. 68,900, హైదరాబాద్‌లో రూ. 73,400, విజయవాడలో రూ. 73,400, విశాఖపట్నంలో రూ. 73,400 గా కొనసాగుతోంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.