మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, అదే బాటలో వెండి
March 18th Gold Rate.మన దేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ధరలు పెరిగినప్పటికీ పసిడి కొనుగోలు
By తోట వంశీ కుమార్ Published on 18 March 2022 2:06 AM GMTమన దేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ధరలు పెరిగినప్పటికీ పసిడి కొనుగోలు చేయడానికి మాత్రం వెనకడగు వేయరు. ఆర్థిక అవసరాల్లో బంగారం ఆదుకుంటుందని బావించడమే అందుకు ఓ కారణం. ఇక పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. శుక్రవారం పసిడి ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర పై రూ.150 నుంచి రూ.200 పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా ధరల పెరుగుదల్లో తేడాలుంటాయి. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండిపై రూ.1110 మేర పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,510
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,480, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,790
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల ధర రూ.51,760
వెండి ధరలు
కిలో వెండి ఢిల్లీలో రూ.69,000, ముంబైలో రూ.69,000, చెన్నైలో రూ.72,900, కోల్‌కతాలో రూ.69,000, బెంగళూరులో రూ.72,900, కేరళలో రూ.72,900, హైదరాబాద్‌లో రూ.72,900, విజయవాడలో రూ.72,900 గా ఉంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.