భారీగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి
March 16th Gold Rate.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 16 March 2022 8:10 AM ISTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర పెరిగితే.. మరోసారి తగ్గుతూ ఉంటుంది. నేడు పసిడి ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.540 మేర తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి పై రూ.1000 మేర తగ్గుముఖం పట్టింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,190, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,570
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల ధర రూ.51,930
వెండి ధరలు
కిలో వెండి ఢిల్లీలో రూ.69,000, ముంబైలో రూ.69,000, చెన్నైలో రూ.72,800, కోల్‌కతాలో రూ.69,000, బెంగళూరులో రూ.72,800, కేరళలో రూ.72,800, హైదరాబాద్‌లో రూ.72,800, విజయవాడలో రూ.72,800 గా ఉంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.