మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
March 15th Gold Rate.మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. ఆర్థిక అవసరాల్లో బంగారం
By తోట వంశీ కుమార్ Published on 15 March 2022 7:25 AM ISTమన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. ఆర్థిక అవసరాల్లో బంగారం ఆదుకుంటుందని బావిస్తుంటారు. ఇక కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. మంగళవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.340 మేర తగ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా బంగారం ధరల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,690, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,120
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,570
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,470
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100, 24 క్యారెట్ల ధర రూ.52,470
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.