ఈ రోజు బంగారం ధర పెరిగిందా..? తగ్గిందా..?
March 12th Gold Rate.బంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 12 March 2022 1:46 AM GMTబంగారం ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఉక్రెయన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇతర దేశాలపై కూడా పడింది. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యాల నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా కొన్నింటి ధరలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరగుతూనే ఉంది. ఒకానొక దశలో 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.52వేలు దాటింది. కాగా.. శనివారం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,570
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,520
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,630
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల ధర రూ.52,580
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.