పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
March 11th Gold Rate.పసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2022 8:05 AM ISTపసిడి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. ఓ సారి ధర తగ్గితే.. మరోసారి ధర పెరుగుతూ ఉంటుంది. ఇక ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. అయితే..నేడు పసిడి ధర దిగి వచ్చింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.1600 వరకు తగ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా పసిడి ధరల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,290
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,630
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,580
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200, 24 క్యారెట్ల ధర రూ.52,580
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.