గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. నెలకు ఓ సారి గ్యాస్ సిలిండర్ల ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. అందులో భాగంగా వాణిజ్య సిలిండర్ల ధరలపై ఆగస్టు 1(ఆదివారం) రూ.73.50 చొప్పున పెంచాయి. కమర్షియల్ సిలిండర్‌ను ఎక్కువగా హోటళ్లు, ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తుంటారు. కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వ్యాపారులకు షాకని చెప్పొచ్చు. తాజాగా పెంపుతో వాణిజ్య సిలిండర్ ధర దేశ రాజధానిలో రేటు రూ.1500 నుంచి రూ.1623 కి పెరిగింది.
జూలై నెలలో చమురు కంపెనీలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై రూ.25.50, కమర్షియల్ సిలిండర్‌పై రూ.84వరకు పెంచిన సంగతి తెలిసిందే. కమర్షియల్ సిలిండర్ల ధరలు కేవలం రెండు నెలల్లో రూ.157.50 వరకు పెరగడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.1803గా ఉన్నది. ఢిల్లీలో 14.2కిలోల సబ్సిడీ సిలిండర్ ధర రూ.834.50కి చేరగా.. కోల్‌కతాలో రూ.861, ముంబైలో రూ.864.50, చెన్నైలో రూ.850.50, హైదరాబాద్‌లో రూ.887 ధర పలుకుతోంది.