పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ గడువు నేటితో ముగియనుంది. అనుసంధానం చేయనివారు మార్చి 31, 2024కు ముందు చేసిన ఆర్థిక లావాదేవీలపై ఎక్కువ టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుందని ఐటీ శాఖ హెచ్చరించింది. టీడీఎస్/టీసీఎస్ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని గుర్తుచేసింది. దీనికి పాన్ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత/చెల్లింపు చేయకపోవటం వల్ల నోటీసులు అందాయని తెలిపింది.
వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో మే 31, 2024 లోపు లింక్ పూర్తి చేయాలని, ఆ లోపు పాన్ యాక్టివేట్ చేసిన వారికి ఎలాంటి అదనపు భారం ఉండదని పేర్కొంది. https://eportal.incometax.gov.in/ సైట్ ద్వారా పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు. " మీ పాన్‌ను మే 31లోపు ఆధార్‌తో లింక్ చేసి.. అధిక రేటుతో పన్ను కోతలను నివారించండి" అని ఎక్స్‌లో చేసిన పోస్టులో ఐటీ శాఖ పేర్కొంది. అయితే ఇందుకు మినహాయించిన వారికి పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయనందుకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.
లింక్ స్టేటస్ చెక్ చేయండిలా..
- లింక్ క్లిక్ చేసి ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించండి .
- హోమ్‌పేజీలో 'Quick Links' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- లింక్ ఆధార్ స్థితిపై క్లిక్ చేసి, కొత్త పేజీలో మీ పాన్, ఆధార్ కార్డ్ నంబర్‌లను అందించండి.
- పాన్, ఆధార్ ఇప్పటికే లింక్ చేసి ఉంటే "Your PAN is already linked to given Aadhaar" అనే పాప్‌అప్ కనిపిస్తుంది.
- లింక్ కాకుంటే “PAN ఆధార్‌తో లింక్ కాలేదు. ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడానికి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి”అని వస్తుంది.