తమ అనుమతి లేకుండా కంపెనీ లోగోను ఎవరూ ఉపయోగించవద్దని ప్రముఖ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రజలను హెచ్చరించింది. అనుమతి లేకుండా ఎవ్వరైనా ఉపయోగించినట్లయితే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
'ఏ వెబ్‌సైట్ కానీ లేదంటే ఇతరులు, వ్యాపారులు ఇలా ఎవ్వరూ కూడా కంపెనీ అనుమతి లేనిదే ఎల్‌ఐసీ లోగో ఉపయోగించకూడదని, అలా చేసినట్లయితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 'ట్వీట్ చేసింది.
అదే సమయంలో మరో విషయంలో కస్టమర్లను అలర్టు చేసింది. మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఎల్‌ఐసీ అధికారులు ఫోన్ కాల్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ నెంబర్లు, నామినీ వివరాలు కోరరని స్పష్టం చేసింది. జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఏమైనా అనుమానిత కాల్స్ లేదా అనుమానాస్పద మెయిల్స్ వస్తే spuriouscalls@licindia.comకు తెలియజేయాలని చెప్పింది. కంపెనీ కాల్ సెంటర్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచింది. 022-6827 6827 నెంబర్‌కు కాల్‌చేసి సందేహాలు పరిష్కరించుకోవచ్చునని తెలిపింది.