ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకు అవకాశం
LIC eases process to claim policy maturity benefits.భారతీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్
By తోట వంశీ కుమార్ Published on 20 March 2021 3:26 AM GMTభారతీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తమ పాలసీదారులకు తీపి కబురు అందించింది. కరోనా కారణంగా క్లెయిమ్ విషయంలో పాలసీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మరో ముందుడుగు వేసింది. మెచ్యూరిటీ తీరిన పాలసీలను తమ సమీప ఎల్‌ఐసీ కార్యాలయాల్లో క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ అవకాశం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. పాలసీ క్లెయిమ్ కోసం ఆయా పాలసీదారులు తమ సమీప ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించి అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలని సూచించింది. పాలసీదారుడు తన బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఏ సమీప బ్రాంచ్ నుంచైనా మెచ్యూరిటీ క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది.
కాగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎల్‌ఐసీకి సంబంధించిన 113 డివిజన్ కార్యాలయాలు, 2,048 బ్రాంచులు, 1,526 శాటిలైట్ కార్యాయాలు, 741 కస్టమర్ జోన్‌లు ఉన్నాయి. ఈ బ్రాంచ్‌ల్లో సేవలు పొందవచ్చని తెలిపింది. అయితే పాలసీదారుడు ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా.. క్లెయిమ్ చెల్లింపును మాత్రం సంబంధిత బ్రాంచ్ మాత్రమే ప్రాసెస్ చేస్తుందని తెలిపింది. ముందుగా పాలసీదారుడు అందజేసిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్ ద్వారా సంబంధిత సర్వీసింగ్ బ్రాంచ్‌కు బదిలీ చేస్తుంది. ఈ క్లెయిమ్ కు సంబంధించి ప్రక్రియ సులభతరం చేసేందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేక అధికారం ఉంటుందని ఎల్‌ఐసీ వెల్లడించింది. ఈ అవకాశం మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది. మీ పాలసీ ఒక బ్రాంచ్‌లో ఉంటే మరో వేరే ప్రాంతంలో ఉన్నా.. అక్కడి నుంచే క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.