పాన్‌కార్డుకు ఆధార్ లింక్‌.. నేడే చివ‌రి రోజు.. రేప‌టి నుంచి రూ.1000 ఫైన్‌

Link Aadhaar with PAN.పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయ‌డానికి నేడే (మార్చి31) ఆఖ‌రి రోజు. గ‌డువు ముగిసిన త‌రువాత చేసిన‌ట్లైతే రూ.1000 లేట్ ఫీజు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2021 12:15 PM IST
link aadhar with PAN

మీరు పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేశారా..? చేయ‌లేదా..? అయితే వెంట‌నే చేసేయండి. పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయ‌డానికి నేడే (మార్చి31) ఆఖ‌రి రోజు. ఒక‌వేళ మీరు నేటిలోగా చేయ‌లేక‌పోతే ఇక మీ పాన్ కార్డు చెల్ల‌దు. ఒక వేళ గ‌డువు ముగిసిన త‌రువాత పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేసిన‌ట్లైతే రూ.1000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇంకెందుకు ఆల‌స్యం త్వ‌ర‌గా మీ పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేయండి.

పాన్‌తో ఆధార్ ఇలా లింక్ చేయండి

- ముందుగా మీరు https://www.incometaxindiaefiling.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయండి. కొత్త పేజీ(pop up window) ఓపెన్ అవుతుంది.

- అందులో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఎంటర్ చేయాలి.

-ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.

-ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Link Aadhaar పైన క్లిక్ చేయాలి. అంతే క్ష‌ణాల్లో మీ పాన్‌ కార్డుతో ఆధార్ నెంబర్ వెంటనే లింక్ అవుతుంది.

SMS ద్వారా కూడా లింక్ చేయ‌వ‌చ్చు..

- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 కు SMS చేయాలి.

- ఇలా చేసేందుకు మీరు మీ మొబైల్‌లో యుఐడిపిఎన్ UIDAI (12 అంకెల ఆధార్ నంబర్) (10 అంకెల పాన్) అని టైప్ చేసి 567678 లేదా 56161 కు పంపాలి.


Next Story