మగువలకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర
June 3rd Gold Price.మన దేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక బంగారం ధరల్లో
By తోట వంశీ కుమార్ Published on 3 Jun 2022 2:32 AM GMTమన దేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక బంగారం ధరల్లో రోజు మార్పులు చోటు చేసుకుంటుంటాయి. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. శుక్రవారం 10గ్రాముల పసిడి ధరపై రూ.110 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,930
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల ధర రూ.51,930
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.