మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్.. బంగారం ధ‌ర భారీగా త‌గ్గింది

June 30th Gold Rate.బంగారం కొనుగోలుదారులకు శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌కు బ్రేక్ ప‌డింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2022 2:05 AM GMT
మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్.. బంగారం ధ‌ర భారీగా త‌గ్గింది

బంగారం కొనుగోలుదారులకు శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న ప‌సిడి ధ‌ర‌కు బ్రేక్ ప‌డింది. నేడు బంగారం ధ‌ర దిగి వ‌చ్చింది. గురువారం 10 గ్రాముల బంగారం ధ‌ర పై ఏకంగా రూ.900 మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,830, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,090

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,770, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,020

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,780, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.51,030

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల ధర రూ.51,000

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story