బంగారం కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌

June 30th Gold price.బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటుంటాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jun 2021 1:24 AM GMT
బంగారం కొనుగోలు దారుల‌కు శుభ‌వార్త‌

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటుంటాయి. ఓ రోజు ధ‌ర పెరిగే.. మ‌రో రోజు ధ‌ర త‌గ్గుతూ ఉంటుంది. దీంతో బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. గ‌త రెండు రోజులుగా బంగారం ధ‌ర‌లు స్థిరంగానే ఉన్నాయి. దేశంలోని కొన్ని చోట్ల బుధ‌వారం స్వ‌ల్పంగా ధ‌ర పెరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,250

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,670, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,220

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,110, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

వెండి ధరలు..

వెండి ధరల్లో కూడా దేశీయంగా రూ.100 వరకు పెరుగగా, హైదరాబాద్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో రూ.100 తగ్గుముఖం పట్టింది. మరి కొన్ని ప్రాంతాల్లో ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, చెన్నైలో రూ.73,500 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కోల్‌కతాలో రూ.67,900 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,900 ఉండగా, కేరళలో రూ.67,900 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, విజయవాడలో రూ.73,500 వద్ద కొనసాగుతోంది.


Next Story