పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
June 27th Gold price.బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 27 Jun 2021 1:48 AM GMTబంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగితే.. మరో రోజు తగ్గుతూ ఉంటుంది. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధర ఆదివారం పెరిగింది. దేశియంగా 10 గ్రాముల బంగారం పై రూ.200 వరకు పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,210
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100
-కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,100
కాగా.. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని తెలిపారు.