నిల‌కడ‌గా ఉన్న బంగారం ధ‌ర‌

June 23th Gold price.బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2021 1:40 AM GMT
నిల‌కడ‌గా ఉన్న బంగారం ధ‌ర‌

బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓ రోజు పెరిగితే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉంటోంది. తాజాగా గురువారం బంగారం నిల‌క‌డ‌గా ఉంది. దేశీయంగా 10 గ్రాముల బంగారం పై కొన్ని చోట్ల‌ రూ.300 వ‌ర‌కు పెరుగ‌గా.. చాలా ప్రాంతాల‌లో నిల‌క‌డ‌గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

-కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,110

అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.


Next Story