భారీగా పెరుగుతున్న బంగారం కొనుగోళ్లు.. నేటి ధ‌ర ఎంతంటే..?

June 23th Gold price.గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌రలు త‌గ్గుతుండ‌డంతో కొనుగోలు పెరుగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Jun 2021 1:41 AM GMT
భారీగా పెరుగుతున్న బంగారం కొనుగోళ్లు.. నేటి ధ‌ర ఎంతంటే..?

గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌రలు త‌గ్గుతుండ‌డంతో కొనుగోలు పెరుగుతున్నాయి. బులియ‌న్ మార్కెట్‌లో ఒడిదుడుకుల కార‌ణంగా నిత్యం బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఓ రోజు పెరిగే.. మ‌రో రోజు త‌గ్గుతూ ఉన్నాయి. గ‌త 10 రోజులుగా త‌గ్గిన ధ‌ర నిన్న కొద్దిగా పెరిగింది. నిన్న తులం ధర రూ.160 పెరిగింది. తాజాగా దేశంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,120 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,120 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,250, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 50,340

- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 46,120, 24 క్యారెట్ల ధర రూ. 47,120

- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,100, 24 క్యారెట్ల రూ.48,110

- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,400, 24 క్యారెట్ల ధర రూ.48,440

- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,100, 24 క్యారెట్ల ధర రూ.48,110

- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,100, 24 క్యారెట్ల రూ.48,110

- విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,100, 24 క్యారెట్ల రూ.48,110

బంగారం ధరల్లో హెచ్చుత‌గ్గులు చోటుచేసుకోవ‌డానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

Next Story