పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.. 8 రోజుల్లో రూ.2,300 తగ్గిన ధర
June 20th Gold price.బంగారం ధరలు మరింత తగ్గనున్నాయా అంటే..అవుననే సమాధానమే వినిపిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 20 Jun 2021 1:31 AM GMTబంగారం ధరలు మరింత తగ్గనున్నాయా అంటే..అవుననే సమాధానమే వినిపిస్తోంది. వరుసగా ఎనిమిది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఈ ఎనిమిది రోజుల్లో రూ.2100 వరకు పుత్తడి ధర తగ్గింది. గత పది రోజుల్లో ధర 8 సార్లు తగ్గగా.. 1సారి పెరుగగా.. 1 సారి స్థిరంగా ఉంది. ఇక ఆదివారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.1,120 వరకు తగ్గుముఖం పట్టగా, కిలో వెండి ధరపై రూ.11000 వరకు తగ్గింది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,230, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,220, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,920
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.
వెండి ధరలు ఇలా..
- ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600,
- చెన్నైలో రూ.73,100
- ముంబైలో రూ.67,600
- కోల్‌కతాలో రూ.67,600
- బెంగళూరులో రూ.67,600
- కేరళలో రూ.67,600
- హైదరాబాద్‌లో రూ.73,100,
- విజయవాడలో రూ.73,100