పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
June 19th gold price.బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2021 1:53 AM GMTబంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా బంగారం ధరల్లో మార్పులేమీ చోటుచేసుకోలేదు. దేశంలో స్థిరంగానే కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం బంగారం ధర రూ.600 పైగా తగ్గింది. గత 10 రోజుల్లో బంగారం ధర 8 సార్లు తగ్గగా.. 1 సారి మాత్రమే పెరిగింది. 1 సారి స్థిరంగా ఉంది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.47,400, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51,490
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 47,350, 24 క్యారెట్ల ధర రూ. 48,350
- బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,250, 24 క్యారెట్ల రూ. 48,250
- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,550, 24 క్యారెట్ల ధర రూ. 48,600
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,250, 24 క్యారెట్ల ధర రూ.48,250
- విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,250, 24 క్యారెట్ల ధర రూ.48,270
- విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,250, 24 క్యారెట్ల ధర రూ. 48,270
బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.