షాక్.. భారీగా పెరిగిన బంగారం రేటు
June 17th Gold Price.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పండుగలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వంటి
By తోట వంశీ కుమార్ Published on 17 Jun 2022 2:22 AM GMTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పండుగలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేకమైన రోజులు ఉంటే చాలా మంది పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఇక పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటుంటాయి. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. వరుసగా రెండు రోజులుగా తగ్గిన పసిడి ధర నేడు పెరిగింది. శుక్రవారం 10గ్రాముల పసిడి ధరపై రూ.430 మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,620, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,940
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల ధర రూ.51,870
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.