శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

June 15th gold price.ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త. బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2021 1:55 AM GMT
శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త. బంగారం కొనుగోలు చేయాల‌నుకునే వారికి శుభ‌వార్త‌. వ‌రుస‌గా మూడో రోజు కూడా బంగారం ధ‌ర త‌గ్గింది, మంగ‌ళ‌వారం ఉదయానికి ప‌లు ప్రాంతాల్లో 10 గ్రాముల ధ‌ర‌పై స్వ‌ల్పంగా రూ.30 త‌గ్గింది. కానీ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం రూ.240 వ‌ర‌కు త‌గ్గింది. : గత 10 రోజుల్లో బంగారం ధర 4 సార్లు పెరగగా 5 సార్లు తగ్గింది. 1 సారి స్థిరంగా ఉంది.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,760, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,760

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,770, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640

బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తిరోజు హెచ్చుత‌గ్గులు ఉంటాయి. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు.


Next Story