గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర
June 13th gold price.బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. వరుసగా రెండో రోజు కూడా బంగారం
By తోట వంశీ కుమార్ Published on 14 Jun 2021 7:17 AM ISTబంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది, సోమవారం ఉదయానికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంటే 10 గ్రాములపై కేవలం రూ.10 మాత్రమే తగ్గింది. అయితే మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. గత 10 రోజుల్లో బంగారం ధర 4 సార్లు పెరగగా... 5 సార్లు తగ్గింది. 1 సారి స్థిరంగా ఉంది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,890, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,190
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,060, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,730, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,730
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,190
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890,
- కేరళలో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.45,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,740, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890
బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు ఉంటాయి. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు.