బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
June 10th gold price.బంగారంలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోరోజు
By తోట వంశీ కుమార్ Published on 10 Jun 2021 9:54 AM ISTబంగారంలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఒక రోజు ధరలు తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు పెళ్లిల్ల కోసం బంగారం కొనాలనుకునేవారికి గుబులు పుట్టించాయి. అయితే.. ఇవాళ మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సిర్థంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్లో గోల్డ్ రేట్ రూ.47,680 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్లో పసిడి ధర రూ. 48,680గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 47,680, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,680
- ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 48,040, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 52,420
- చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,300, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,500
- బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 50,070
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,070
- విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,900, 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.50,070
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు.. బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.