మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన వెండి.. స్థిరంగా బంగారం
July 9th Gold price.పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించే వార్త ఇది. గత కొద్ది రోజులుగా వరుసగా బంగారం
By తోట వంశీ కుమార్ Published on 9 July 2021 7:32 AM ISTపసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించే వార్త ఇది. గత కొద్ది రోజులుగా వరుసగా బంగారం పెరుగుతుండగా.. నేడు కాస్త బ్రేకులు పడ్డాయి. శుక్రవారం బంగారం ధర స్థిరంగా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే భారీగా తగ్గింది. వెయ్యి రూపాయలకుపైగా తగ్గుముఖం పట్టింది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,850
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,980, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,980
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710
బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, చెన్నైలో రూ.74,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కోల్‌కతాలో రూ.69,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కేరళలో రూ.69,000 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,100 ఉండగా, విజయవాడలో రూ.74,100 వద్ద కొనసాగుతోంది.