ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

July 7th Gold Price.బంగారం ధరల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 July 2021 1:47 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

బంగారం ధరల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటున్నాయి. దేశీయంగా బంగారం దూకుడు కొన‌సాగుతోంది. ప‌సిడి ధ‌ర రోజు రోజుకి పైకి ఎగ‌బాకుతోంది. గ‌త వారం రోజులుగా బంగారం ధ‌ర పెర‌గ‌డం త‌ప్ప త‌గ్గ‌డం లేదు. నేడు కూడా బంగారం ధ‌ర పెరిగింది. బుధ‌వారం దేశీయంగా రూ.100 వ‌ర‌కు పెరిగింది. ఇక బంగారం బాట‌లోనే వెండి కూడా ప‌య‌నిస్తోంది. కిలో వెండిపై రూ.200 వ‌ర‌కు పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,550

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,750

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440

వెండి ధ‌ర‌లు..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,600 ఉండగా, చెన్నైలో రూ.75,200 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.70,600 ఉండగా, కోల్‌కతాలో రూ.70,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,200 ఉండగా, విజయవాడలో రూ.75,200 వద్ద కొనసాగుతోంది.

Next Story