ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

July 6th Gold price.బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. వ‌రుస‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2021 1:52 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌

బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయి. వ‌రుస‌గా నాలుగు రోజులు పెరిగిన బంగారం ధ‌ర నేడు దిగి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం దేశీయంగా స్వ‌ల్పంగా ప‌సిడి ధ‌ర త‌గ్గింది. 10 గ్రాముల బంగారం పై రూ.130 త‌గ్గింది. అయితే.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో మాత్రం రూ.40 పెరిగింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,730, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,800

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,310

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,920, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,620

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,310, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340

బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story