మగువలకు షాక్.. పరుగులు పెడుతున్న పసిడి
July 31st Gold Price.పసిడి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఇక మనదేశంలో
By తోట వంశీ కుమార్ Published on 31 July 2021 1:54 AM GMTపసిడి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఇక మనదేశంలో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్ల విషయంలో ధర ఎంత పెరిగినా ఏ మాత్రం వెనుకడుగు వేయలేని పరిస్థితి నెలకొని ఉంది. శనివారం దేశీయంగా బంగారం ధరలు పరుగులు పెట్టాయి. 10 గ్రాముల ధరపై రూ.350 నుంచి 400 వరకు పెరిగింది. అయితే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరలు నమోదు అయ్యాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,380
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,620, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,770
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,100
- బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.49,370
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370
బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.