పరుగులు పెడుతున్న పసిడి.. ధర ఎంత పెరిగిందంటే
July 30th Gold price.బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. మన దేశంలో బంగారానికి
By తోట వంశీ కుమార్ Published on 30 July 2021 2:33 AM GMTబంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. మహిళలు బంగారం కొనుగోళ్ల విషయంలో ధర ఎంత పెరిగినా.. ఏ మాత్రం వెనుకడుగు వేయరు. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైంది. శుక్రవారం దేశీయంగా బంగారం ధరలు పరుగులు పెట్టాయి. 10 గ్రాముల ధరపై రూ.250 నుంచి 300 వరకు పెరిగింది. అయితే ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ధరలున మోదు అయ్యాయి.
దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,070
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,420
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,360, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,060
- బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,990
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,900
బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.