ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

July 2nd Gold price.ప‌సిడి ప్రియుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. ప్ర‌తి రోజు బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2021 1:49 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర

ప‌సిడి ప్రియుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. ప్ర‌తి రోజు బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటున్నాయి. శుక్ర‌వారం బంగారం ధ‌ర భారీగా పెరిగింది. దేశియంగా 10 గ్రాముల బంగారం పై రూ.450 వ‌ర‌కు పెరిగింది. అయితే ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. ఇక వెండిసైతం బంగారం బాట‌లోనే ప‌య‌నించింది. కిలో వెండిపై ఏకంగా రూ.1100 వ‌ర‌కు ఎగ‌బాకింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,470

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,190, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,190

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,340, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000

-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000

వెండి ధరలు

దేశీయంగా వెండి ధ‌ర కిలోకు రూ.1100 వరకు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా పెరుగుదల నమోదైంది. హైదరాబాద్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో రూ.1200 వరకు పెరిగింది.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, చెన్నైలో రూ.74,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, కోల్‌కతాలో రూ.68,700 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,700 ఉండగా, కేరళలో రూ.68,700 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,100 ఉండగా, విజయవాడలో రూ.74,100 వద్ద కొనసాగుతోంది.

బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story