మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

July 28th Gold price.ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటాయి. గ‌త కొద్ది రోజులుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2021 2:39 AM GMT
మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తి రోజు హెచ్చు త‌గ్గులు చోటు చేసుకుంటాయి. గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధ‌ర నేడు కాస్త దిగి వ‌చ్చింది. పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో ధర ఎంత పెరిగినా కూడా పసిడి కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు దిగి వచ్చాయి. బుధ‌వారం 10గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.200 త‌ర‌కు త‌గ్గింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,660, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,660

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,040, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,190

- బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,660

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660

ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోవడానికి అనేక కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయ‌ని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story