మగువలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
July 27th Gold price.బంగారం కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో..
By తోట వంశీ కుమార్ Published on 27 July 2021 1:39 AM GMTబంగారం కొనుగోలు దారులకు పసిడి ధరలు షాకిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. పసిడి ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు చేయక తప్పడం లేదు. ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు, మూడు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. మంగళవారం పెరిగాయి. దేశీయంగా మంగళవారం 10గ్రాములపై పసిడి ధరపై రూ.100 పెరిగింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,220
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,060, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,160
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,870, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950
- బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.48,880
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.