బంగారం కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

July 25th Gold Price.ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తిరోజు హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2021 2:06 AM GMT
బంగారం కొనుగోలుదారుల‌కు శుభ‌వార్త‌

ప‌సిడి ధ‌ర‌ల్లో ప్ర‌తిరోజు హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ రోజు పెరిగే.. మ‌రోరోజు త‌గ్గుతూ ఉంటుంది. దేశీయంగా గ‌త కొద్ది రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. నేడు బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. కాగా.. వెండి ధ‌ర కిలోకు రూ.350మేర త‌గ్గింది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,850, 24 క్యారెట్ల ధ‌ర రూ. 51,110

- ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,870, 24 క్యారెట్ల ధర రూ. 47,870

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర‌ రూ. 45,060, 24 క్యారెట్ల ధ‌ర రూ. 49,160

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర‌ రూ.44,700, 24 క్యారెట్ల ధర రూ. 48,770

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర‌ రూ. 44,700, 24 క్యారెట్ల ధర రూ. 48,770

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర‌ రూ. 44,700, 24 క్యారెట్ల ధర రూ. 48,770

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10గ్రాముల ధ‌ర రూ. 44,700, 24 క్యారెట్ల ధర రూ. 48,770

బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం, వెండి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు..

ఇక దేశీయంగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,050 ఉండగా, చెన్నైలో రూ.72,000 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,050 ఉండగా, కోల్‌కతాలో రూ.67,050 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, విజయవాడలో రూ.72,000 వద్ద కొనసాగుతోంది.

Next Story