పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్
July 24th Gold Rate.మొన్నటి వరకు స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 24 July 2022 2:02 AM GMTమొన్నటి వరకు స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధర పెరిగింది. శనివారం 10గ్రాముల బంగారం ధరపై రూ.400 పెరుగగా ఆదివారం రూ.500 మేర పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే దాదాపు వెయ్యి రూపాయల వరకు పసిడి ధర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,960, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,230
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,930, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51.190
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల ధర రూ.51,160
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.