షాకింగ్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

July 24th Gold Price.బంగారం కొనుగోలు దారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2021 7:52 AM IST
షాకింగ్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

బంగారం కొనుగోలు దారుల‌కు ధ‌ర‌లు షాకిస్తున్నాయి. రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌చ్చిన ధ‌ర నేడు మ‌ళ్లీ పెరిగింది. శ‌నివారం బంగారం ధ‌ర రూ. 170 వ‌ర‌కు పెరిగింది. పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,850, 24 క్యారెట్ల ధ‌ర రూ. 51,110

- ముంబయిలో మాత్రం స్వల్పంగా తగ్గింది. శనివారం ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,870, 24 క్యారెట్ల ధర రూ. 47,870

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర‌ రూ. 45,060, 24 క్యారెట్ల ధ‌ర రూ. 49,160

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర‌ రూ.44,700, 24 క్యారెట్ల ధర రూ. 48,770

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర‌ రూ. 44,700, 24 క్యారెట్ల ధర రూ. 48,770

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర‌ రూ. 44,700, 24 క్యారెట్ల ధర రూ. 48,770

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10గ్రాముల ధ‌ర రూ. 44,700, 24 క్యారెట్ల ధర రూ. 48,770

బంగారం వెండి ధరలు పెరగడానికి ఎన్నో కార‌ణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం, వెండి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story