భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

July 21th Gold price.మొన్న‌టి దాకా త‌గ్గుతున్న‌ట్లే క‌నిపించిన బంగారం ధ‌ర‌లు గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2021 2:04 AM GMT
భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌

మొన్న‌టి దాకా త‌గ్గుతున్న‌ట్లే క‌నిపించిన బంగారం ధ‌ర‌లు గ‌త కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం (నేడు) మరోసారి గోల్డ్‌ రేట్స్‌ భారీగా పెరిగాయి. ఒకేరోజు దాదాపు రూ. 300 వరకు పెరగడం గమనార్హం.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల ధర రూ. 51,710

- ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.47,300, 24 క్యారెట్ల ధ‌ర రూ. 48,300

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.45,250, 24 క్యారెట్ల ధర రూ.49,370

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,660, 24 క్యారెట్ల ధర రూ. 49,810

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,250, 24 క్యారెట్ల రూ.49,370

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,250, 24 క్యారెట్ల ధ‌ర రూ. 49,370

- విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,250, 24 క్యారెట్ల రూ. 49,370

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story