బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
July 20th Gold Rate.మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. సందర్భం ఏదైనా కానివ్వండి మనవాళ్లు బంగారాన్ని కొనుగోళ్లు
By తోట వంశీ కుమార్ Published on 20 July 2022 2:11 AM GMTమనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. సందర్భం ఏదైనా కానివ్వండి మనవాళ్లు బంగారాన్ని కొనుగోళ్లు చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. ఇక పసిడి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకనే కొనుగోలుదారులు వాటి ధరలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. నిన్న పసిడి ధర తగ్గగా నేడు పెరిగింది. మంగళవారం 10 గ్రాముల పసిడి రూ.110మేర పెరిగింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,810 గా ఉంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,810
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,810
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,570
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,380, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,600
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల ధర రూ.50,510
బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.