ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌.. పెరిగిన బంగారం, త‌గ్గిన వెండి

July 20th Gold Price.ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునేవారికి బంగారం ధ‌ర‌లు షాకిస్తూనే ఉన్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2021 1:45 AM GMT
ప‌సిడి కొనుగోలుదారుల‌కు షాక్‌.. పెరిగిన బంగారం, త‌గ్గిన వెండి

ప‌సిడి కొనుగోలు చేయాల‌నుకునేవారికి బంగారం ధ‌ర‌లు షాకిస్తూనే ఉన్నాయి. బంగారం ధ‌ర‌ల్లో ప్ర‌తిరోజు హెచ్చుత‌గ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. గ‌త రెండు రోజులుగా త‌గ్గిన బంగారం నేడు స్వ‌ల్పంగా పెరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,460, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,560

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,040, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090

- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు..

ఇక దేశీయంగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, చెన్నైలో రూ.72,900 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, కోల్‌కతాలో రూ.67,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,800 ఉండగా, కేరళలో రూ.67,800 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,900 ఉండగా, విజయవాడలో రూ.79,900 వద్ద కొనసాగుతోంది.

Next Story
Share it