బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతకొద్ది రోజులుగా పెరిగుతూ వస్తున్నధరలు కాస్త తగ్గాయి. ఆదివారం బంగారం ధరపై రూ.250 వరకు తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ 250 మేర తగ్గి.. 10 గ్రాముల బంగారం ధర ధర రూ.47,150 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ధర రూ.260తగ్గింది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.51,440గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ51,440. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150
- ముంబైలో 22 క్యారెట్ల ధర రూ. 47,200, 24 క్యారెట్ల ధర రూ. 48,200
- హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,00, 24 క్యారెట్ల ధర రూ.49,010
- విజయవాడలో10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,00, 24 క్యారెట్ల ధర రూ.49,010
- విశాఖపట్టణంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,00, 24 క్యారెట్ల ధర రూ.49,010
బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని అంటున్నారు.