మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్.. వ‌రుస‌గా రెండో రోజు బంగారం ధ‌ర త‌గ్గింది

July 17th Gold Rate.ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర త‌గ్గితే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 July 2022 7:28 AM IST
మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్.. వ‌రుస‌గా రెండో రోజు బంగారం ధ‌ర త‌గ్గింది

ప‌సిడి ధ‌ర‌ల్లో నిత్యం హెచ్చుత‌గ్గులు చోటు చేసుకుంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఓ సారి ధ‌ర త‌గ్గితే మ‌రోసారి పెరుగుతూ ఉంటుంది. అందుక‌నే ప‌సిడి కొనుగోలుదారులు వాటి ధ‌ర‌ల‌పై ఎల్ల‌ప్పుడూ ఓక‌న్నేసి ఉంచుతారు. వ‌రుస‌గా రెండో రోజు కూడా బంగారం ధర త‌గ్గింది. ఆదివారం 10 గ్రాముల ప‌సిడి పై ఏకంగా రూ.300 మేర త‌గ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 గా ఉంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో పసిడి ధ‌ర‌లు..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,270, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,480

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.50,480

- హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200, 24 క్యారెట్ల ధర రూ.50,400

బంగారం ధరల‌ హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story