పసిడి కొనుగోలుదారులకు షాక్.. పెరిగిన బంగారం ధర
July 14th Gold price.పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి బంగారం ధరలు షాకిస్తూనే ఉన్నాయి
By తోట వంశీ కుమార్ Published on 14 July 2021 7:11 AM IST
పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి బంగారం ధరలు షాకిస్తూనే ఉన్నాయి. బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. నేడు కూడా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దేశీయంగా 10గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు పెరిగింది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,210, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,320
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,890, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,890
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,000
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,800
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,880
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,880
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,880
బంగారం వెండి ధరలు పెరగడానికి ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం, వెండి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.