ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
July 10th Gold price.బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 10 July 2021 2:04 AM GMTబంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూనే ఉంటాయి. గత వారం రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. శనివారం కాస్త దిగి వచ్చింది. అయితే దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గినా.. హైదరాబాద్‌తో పాటు కొన్ని ప్రధాన నగరాల్లో స్వల్పంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,310
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,810, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820
బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వెండి ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,800 ఉండగా, చెన్నైలో రూ.73,400 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.6,800 ఉండగా, కోల్‌కతాలో రూ.68,800 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,800 ఉండగా, కేరళలో రూ.68,800 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 వద్ద కొనసాగుతోంది.