జియో నెట్‌వర్క్ సేవల్లో అంతరాయం..!
Jio Network down for many users.సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజూమున 4 గంటల వరకు
By తోట వంశీ కుమార్ Published on 6 Oct 2021 1:42 PM ISTసోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజూమున 4 గంటల వరకు సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జియో నెట్‌వర్క్ వాడుతున్న వినియోగదారుల సేవలకు కాసేపు అంతరాయం ఎదురైనట్లు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. జియో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలిపింది.
నెట్‌వర్క్ సేవలను డౌన్ డిటెక్టర్ పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. రెండున్నర గంటలుగా జియో నెట్‌వర్క్ నో సర్వీస్ అని చూపిస్తున్నట్టు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. జియోడౌన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్విటర్ పోస్టులను బట్టి చూస్తే.. ఇప్పటి వరకు 4 వేల మందిపైగా వినియోగదారులు నెట్‌వర్క్ సమస్కను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. దేశమొత్తంగా కాకున్నప్పటికి.. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలు సహా ఢిల్లీ, బెంగళూరు, ఇతర కొన్ని నగరాల్లో ఈ సమస్య ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా.. దీనిపై జియో కేర్ స్పందించింది. యూజర్లకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని తెలిపింది. ఇంటర్నెట్ సేవలు వినియోగించడంలో లేదా కాల్స్/ఎస్ఎంఎస్ సేవలు వినియోగించుకునేటప్పుడు సాధారణంగా అప్పుడప్పుడు కలిగే సమస్యే ఇది అని చెప్పింది. ఇది తాత్కాలికమైన సమస్య అని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తమ బృందం పనిచేస్తున్నట్టు వెల్లడించింది.