జియో రేంజ్ వేరయా..!
Jio named in world's 'Top 25 Strongest Brands' list. అంతర్జాతీయంగా బలమైన బ్రాండ్లలో అయిదో స్థానాన్ని సొంతం చేసుకుంది జియో.
By Medi Samrat Published on 29 Jan 2021 9:24 AMభారతదేశ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి. అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ అంటూ దేశాన్ని ఓ ఊపు ఊపింది జియో. ఇక భారీ ఆఫర్లు, అందుకు తగ్గట్టుగా క్యాష్ బ్యాక్ ఇస్తూ వెళుతున్న జియో నాలుగేళ్లలోనే అగ్రస్థానంలోకి దూసుకెళ్ళింది. ఇక బలమైన బ్రాండ్ వ్యాల్యూ విషయంలో ముకేశ్ అంబానీ సంస్థ దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా బలమైన బ్రాండ్లలో అయిదో స్థానాన్ని సొంతం చేసుకుంది జియో.
'గ్లోబల్ 500' జాబితాను బ్రాండ్ ఫైనాన్స్ తాజాగా విడుదల చేసింది. చైనాకు చెందిన 'వియ్‌చాట్' అగ్రస్థానంలో నిలిచింది. అగ్ర స్థానంలో ఉన్న పెరారీని వియ్‌చాట్ రెండో స్థానంలోకి నెట్టేసింది. రష్యాకు చెందిన ఎస్బర్ బ్యాంక్, కోకాకోలా మూడు నాలుగు ర్యాంకుల్లో నిలిచాయి. జియో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. 40 కోట్ల మంది వినియోగదారులతో జియో భారత దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌గా, ప్రపంచంలో మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా నిలిచిందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. ప్రతిష్ఠ, మౌత్ పబ్లిసిటీ, కొత్తదనం, సేవలు, డబ్బుకు తగ్గ విలువ వంటి అంశాల్లో జియో టాప్ లో ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ కూడా ఇదేనని.. 50 శాతం వృద్ధితో తన బ్రాండ్ విలువను 480 కోట్ల డాలర్లకు చేర్చుకుందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. ఏది ఏమైనా అటు దేశ వ్యాప్తంగానూ.. ఇటు అంతర్జాతీయంగానూ జియో మంచి పేరును తెచ్చుకుంటూ ఉంది. జియోతో చేయి కలపడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి.