గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
January 8th Gold Rate.పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర దిగి తగ్గింది.
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2022 7:38 AM ISTపసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర దిగి తగ్గింది. శనివారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.300 మేర తగ్గింది. దేశంలో ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా పసిడి ధరల్లో తగ్గుదల ఉంటుంది. దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర రూ.46,510 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,510 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,510, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,510
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,940
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,450
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,130, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,650
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,600, 24 క్యారెట్ల ధర రూ.48,650
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.