మ‌గువ‌ల‌కు శుభవార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

January 7th Gold Rate.ప‌సిడి కొనుగోలుదారుల‌కు నిజంగా శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Jan 2022 7:29 AM IST
మ‌గువ‌ల‌కు శుభవార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర

ప‌సిడి కొనుగోలుదారుల‌కు నిజంగా శుభ‌వార్త‌. గ‌త కొద్ది రోజులుగా పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు దిగివ‌స్తున్నాయి. నేడు ప‌సిడి ధ‌ర త‌గ్గింది. శుక్ర‌వారం 10 గ్రాముల బంగారం ధ‌ర‌పై రూ.200 మేర త‌గ్గింది. దేశంలో ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా ప‌సిడి ధ‌ర‌ల్లో త‌గ్గుద‌ల ఉంటుంది. దేశీయంగా 10 గ్రాముల ప‌సిడి ధర రూ.46,830 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,830, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,830

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,170, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,750

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,140, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,660

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950, 24 క్యారెట్ల ధర రూ.49,040

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story