ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర

January 6th Gold Rate.వ‌రుసగా రెండు రోజులు త‌గ్గిన బంగారం ధ‌ర నేడు పెరిగింది. గురువారం 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ.250 మేర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 2:11 AM GMT
ప‌సిడి ప్రియుల‌కు షాక్‌.. మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర

వ‌రుసగా రెండు రోజులు త‌గ్గిన బంగారం ధ‌ర నేడు పెరిగింది. గురువారం 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ.250 మేర పెరిగింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లోని ప‌రిస్థితులు, డిమాండ్ ఆధారంగా బంగారం పెరుగుద‌ల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 10 గ్రాముల ప‌సిడి ధర రూ.47,300 ఉండ‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,580 వ‌ద్ద కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌సిడి ధ‌ర‌లు ఇలా..

- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,580

- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,080, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,080

- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,350, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,480

- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950

- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250

- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.46,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.48,630

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250

- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250

- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల ధర రూ.49,250

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Next Story