వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. ఏ ఏ నగరాల్లో ఎంత ఉందంటే..?
January 5th Gold Rate.గతకొద్ది రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధర ఇటీవల కాస్త దిగివస్తోంది. వరుసగా
By తోట వంశీ కుమార్ Published on 5 Jan 2022 2:08 AM GMTగతకొద్ది రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధర ఇటీవల కాస్త దిగివస్తోంది. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. బుధవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.350 మేర తగ్గింది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, డిమాండ్ ఆధారంగా బంగారం తగ్గుదలల్లో తేడాలు ఉంటాయి. దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర రూ.47,260 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,260, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,260
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,170, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,120, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,630
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900, 24 క్యారెట్ల ధర రూ.48,990
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.