పసిడి కొనుగోలుదారులకు శుభవార్త
January 4th Gold Rate.పసిడి కొనుగోలుదారులకు నిజంగా ఇది శుభవార్తే. వరుసగా పెరుగుతున్న బంగారం ధరకు
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2022 2:11 AM GMTపసిడి కొనుగోలుదారులకు నిజంగా ఇది శుభవార్తే. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు పసిడి ధర తగ్గింది. మంగళవారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.150 నుంచి రూ.210 మేర తగ్గింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో పసిడి ధర తగ్గగా.. కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర రూ.47,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,640
- కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,150
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,080
- హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,360
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,250, 24 క్యారెట్ల ధర రూ 49,360
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.