శుభవార్త.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర
January 29th Gold Rate.పసిడి కొనుగోలుదారులకు శుభవార్త. నిన్న మొన్నటి దాకా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు
By తోట వంశీ కుమార్ Published on 29 Jan 2022 2:17 AM GMTపసిడి కొనుగోలుదారులకు శుభవార్త. నిన్న మొన్నటి దాకా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర తగ్గింది. శనివారం 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 మేర తగ్గింది. దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్, పరిస్థితుల కారణంగా ధర తగ్గుదల్లో తేడాలుంటాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,490, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,630
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
- పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250
- విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,150, 24 క్యారెట్ల ధర రూ.49,250
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.